Yemi Neinu Samarpinthu Yesu Christian Song Lyrics in Telugu and English available from Andhra Kraisthava Keerthanalu.
ఏమి నేను సమర్పింతు యేసూ యెట్లు నిన్ను స్తుతియింతు ఏమి సమర్పింతు హీనుఁడ నగు నేను గామితార్థము లెల్ల గలుగఁజేయు నీకు ||నేమి||
1.
నేను మార్గముఁ దప్పియుండఁగ నన్ను నీవు కంటివి కరుణ నిండఁగ దీనపాపులను దృఢముగఁ బ్రోవను దాన మిచ్చితివి తనర నీ ప్రాణము ||నేమి||
2.
అందరి కొఱ కీవు తెచ్చిన మిగుల అందమైన నిత్య రక్షణ అంది నిన్ను వినతి పొందుగఁ జేసెద నొందు మా నా నుతి నుత్తమ ప్రభు క్రీస్తు ||ఏమి||
3.
నీ యందే యానంద మొదఁగ యేసు నీదైన యాత్మ నాకందఁగ జేయు మంచు నీకుఁ జేసెదఁ బ్రార్థన నాయందు దయచేసి నా మనవి నాలించు ||మేమి||
4.
నేను జేసిన యఘము లెల్లను గర్త నీ యెదుటఁ దలంచు కొందును నేను సిగ్గు నొంది నిజముగఁ గుందుచు నేను వేఁడుకొందు నీ క్షమాపణ కొరకు ||నేమి||
5.
నన్ను నీవు స్థిరపరచుము కర్త యన్నిట నను బలపరుచుము తిన్నని మార్గమున దృఢముగ నేగుచు నిన్ను నే స్తుతియింతు నిండుగ నెల్లప్పు ||డేమి||
Yemi Neinu Samarpinthu Yesu Christian Song Lyrics in English:
Emi nenu samarpintu yesu yetlu ninnu stutiyintu emi samarpintu hinumda nagu nenu gamitarthamu lella galugamjeyu niku ||nemi||1. Nenu margamum dappiyundamga nannu nivu kantivi karuna nindamga dinapapulanu drdhamugam brovanu dana miccitivi tanara ni pranamu ||nemi||
2. Andari kora kivu teccina migula andamaina nitya raksana andi ninnu vinati pondugam jeseda nondu ma na nuti nuttama prabhu kristu ||emi||
3. Ni yande yananda modamga yesu nidaina yatma nakandamga jeyu mancu nikum jesedam brarthana nayandu dayacesi na manavi nalincu ||memi||
4. Nenu jesina yaghamu lellanu garta ni yedutam dalancu kondunu nenu siggu nondi nijamugam gunducu nenu vemdukondu ni ksamapana koraku ||nemi||
5. Nannu nivu sthiraparacumu karta yannita nanu balaparucumu tinnani margamuna drdhamuga negucu ninnu ne stutiyintu ninduga nellappu ||demi||
No comments:
Post a Comment
Dont Post Abuse Comments