ఇదిగో నీతిభాస్కరుండు ఉదయమాయె నతని నీతి హృదయ కమలమునను నిలిచి మది తమోగుణంబులణపె సదమల జ్ఞానంబు నొసఁగె ||ఇదిగో||
1.
ఎవని జ్ఞానమహిమ విభవ మెవనినీతి బలప్రకాశ మెవని మనుజ రూపమాయె నవనీత సత్యవర్తి రవినిమించు తేజమూర్తి ||ఇదిగో||
2.
నరజనముల నీతియెవడో ధరణిపతుల దీప్తియెవడో దురితఋణము దీర్చునెవఁడో పరమపురుష డేసుఁడతఁడె నిరతజీవ మొసగునిపుడె ||ఇదిగో||
3.
కలుష మెల్ల బాపదలఁచి కలువరి గిరివరకు నడచి యలవికాని ముక్తి గూర్చన్ సిలువమీద బలియై మరణ బలముణఁచి తిరిగిలేచె ||ఇదిగో||
4.
మదితమం బదెచటికరిగె యెదను కఠినతము కరిగె హృదయరసము లతిశయించి సాధుగుణముగలిగి యేసు పాదములను గొలుతు నిపుడె ||ఇదిగో||
5.
జనగణముల జీవమతఁడె ధనఘనముల దాతయతఁడె యనుభవమున నెఱుఁగుమతని యనుపమ ప్రేమా మృతంబు ననవరతా నందకరము ||ఇదిగో||
Christian Song Lyrics in English:
Idigo nitibhaskarundu udayamaye natani niti hrdaya kamalamunanu nilici madi tamogunambulanape sadamala jnanambu nosamge ||idigo||1. Evani jnanamahima vibhava mevaniniti balaprakasa mevani manuja rupamaye navanita satyavarti ravinimincu tejamurti ||idigo||
2. Narajanamula nitiyevado dharanipatula diptiyevado durita'rnamu dircunevamdo paramapurusa desumdatamde niratajiva mosagunipude ||idigo||
3. Kalusa mella bapadalamci kaluvari girivaraku nadaci yalavikani mukti gurcan siluvamida baliyai marana balamunamci tirigilece ||idigo||
4. Maditamam badecatikarige yedanu kathinatamu karige hrdayarasamu latisayinci sadhugunamugaligi yesu padamulanu golutu nipude ||idigo||
5. Janaganamula jivamatamde dhanaghanamula datayatamde yanubhavamuna nerumgumatani yanupama prema mrtambu nanavarata nandakaramu ||idigo||
No comments:
Post a Comment
Dont Post Abuse Comments